అది అర్థరాత్రి సమయం.. అందరూ మంచి నిద్రలో జారుకునే సమయం.. మందుబాబులు త్రాగడం పూర్తిచేసుకుని ఇంటికి చేరుకునే సమయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగులు కానీ తమ డ్యూటీ పూర్తి చేసి ఇంటికి బయలుదేరుతున్న సమయం అది.
అయితేనేమి ఇవేమి తనకు పట్టనట్లు టాలీవుడ్ అందాల రాక్షసి రాశీ ఖన్నా చేసిన పనికి అందరూ షాకయ్యారు.రాశీ ఖన్నా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో కల్సి నటిస్తున్న తాజా చిత్రం ప్రతిరోజు పండుగే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ రోడ్లపై జరుగుతుంది.
ఈ సమయంలోనే కాస్త విరామం దొరకడంతో రాశీ ఖన్నా రోడ్డు మధ్యలో కుర్చి వేసుకుని కూర్చుంది. అంతే హీరో సాయిధరమ్ తేజ్ తన కెమెరా పనితనానికి పని చెప్పి ఫోటోల మీద ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను అమ్మడు తన ఇన్ స్ట్రా గ్రాం లో పోస్టు చేయడంతో అవి వైరలయ్యాయి.