తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు క్షేమంగా ఉండటంతో పాఠశాల యజమాన్యంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
