Home / ANDHRAPRADESH / మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి టాప్ సీక్రేట్స్

మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి టాప్ సీక్రేట్స్

ఏపీ టీడీపీ సీనియర్ నేత,చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ,ప్రముఖ నటుడు శివప్రసాద్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం.
* ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లా పూటిపల్లి.
* నాగయ్య ,చెంగమ్మ దంపతులకు 1951 జూలై 11న జన్మించారు.
* ఆయనకు భార్య,ఇద్దరు కుమార్తెలున్నారు.
* ఆయన అప్పటి మద్రాస్ రాష్ట్రంలో పుట్టారు.
* తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారు.
* ఆయన స్వతహాగా రంగస్థల, సినీ నటుడు.
* టీడీపీలో చేరడంతో రాజకీయాల్లో ఎంట్రీ.
* 1999-2004మధ్య సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు
* 1999-2001మధ్య సమాచార,సాంస్కృతిక శాఖ మంత్రి అయ్యారు.
* 2009,2014 టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు.