తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానే వచ్చింది. నిన్నటి నుండి ఈ ఎన్నికల బరిలోకి దిగేవారి నుండి నామినేషన్లను స్వీకరిస్తుంది ఎన్నికల సంఘం.
ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలోకి దిగి కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఖరారు చేసి బీఫారం అందించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ తరపున కోదాడ మాజీ ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి కుమార్తై శ్రీకళారెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే ఈ పేరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచినట్లు సమాచారం.