వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుకు చురకలు అంటించారు. రివర్స్ టెండర్లతో మీ అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా? టెండర్లలో పాల్గొనద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట. ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబు గారూ? అని ప్రశ్నించాడు.
