అనుపమ పరమేశ్వరన్..తన కెరీర్ మొదటి సినిమా ప్రేమమ్ తోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో, స్టైల్ తో దర్శకులను మెప్పించి మంచి పేరు సంపాదించింది. అదే ఊపుతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా మంచిగానే రాణించింది. అలా నడుస్తున్న తన సినీ ప్రయాణంలో ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. అవేమిటంటే క్రికెటర్ బూమ్రాతో తనకు ఎఫైర్ ఉందనే వార్త బాగా వైరల్ అయ్యింది. దీనికి స్పందించిన అనుపమ మేమిద్దరం మంచి స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చింది. అప్పటినుండి తనకు కలిసి రావడంలేదనే చెప్పాలి. సినిమాలు లేక కాలిగా ఉండలేక ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ లతోనే కాలం గడిపేస్తుంది. అంతేకాకుండా కొన్నింటికి యాడ్స్ కూడా ఇస్తుంది. మరి జీవితం మొత్తం సోషల్ మీడియాకే అంకితమిస్తుందా లేదా సినిమాల్లో కనిపిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
