వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ గెలిచిన సీట్ల సంఖ్య 151. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి తో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర తో చిరంజీవి చేసిన సినిమాల సంఖ్య 151. ప్రస్తుతం ఈ సినీ రాజకీయ దిగ్గజాల కలయిక ఒక నెంబర్ తో ముడిపడి ఉండడం పట్ల అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ 175 సీట్లలో పోటీ చేయగా 151 సీట్లు గెలిచారు. అలాగే చిరంజీవి తన కెరీర్ పరంగా అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటి వరకు నూట యాభై ఒక్క సినిమాల్లో నటించారు. యాదృచ్ఛికమో దైవమోగాని వీరిద్దరు ప్రస్తుతానికి ఒక్క నెంబర్ మీద ఫామ్ లో ఉన్నారు. ఇద్దరికీ న్యూమరాలజీ ప్రకారం కలిసి వెళ్తే మేలు జరుగుతుందని జగన్ చిరంజీవి కలయిక ఇద్దరికీ మంచిది అంటూ మరికొందరు చెబుతున్నారు. చిరంజీవి పట్ల ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ తో మెలగడం ఆయన ఫ్యాన్స్ లో చర్చనీయాంశం అవుతుందని అలాగే చిరంజీవి ప్రభుత్వంతో సక్యతగా ఉంటే ఆయనకు మంచిదంటున్నారు. అయితే కలిసి అడుగులు వేస్తారు లేదా ఎప్పటిలాగానే మంచి స్నేహితులు గా ఉంటారా అనేది వేచి చూడాలి.
