దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ గారని అన్నారు. రైతు బంధు పథకం దేశానికే ఆదర్శనంగా నిలిచిందని అన్నారు.
గతంలో ఏదైనా ప్రమాద వశాత్తు రైతులు చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడేదని, కానీ నేడు సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు భీమా ద్వారా వారి కుటుంబాలకు కొంత ఆర్ధిక భరోసా కలుగుతుందని తెలిపారు.
హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతపాక సునీత రాజు, జడ్పిటీసి రేణుకుంట్ల సునీత ప్రసాద్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జక్కు రమేష్, సర్పంచులు, ఎంపిటిసిలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 371