తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎప్పుడు ఏదో ఒక అంశంతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ నేత.. మాజీ మంత్రి .. తెలంగాణ టీడీపీ సీనియర్ మాజీ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు.
అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులను కలిసి బీజేపీలో చేరాలని కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. గతంలో ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.