టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కన్నడ భామ హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిలేరు నీకెవ్వరు.
ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ టీజర్ ను నిన్న శుక్రవారం చిత్రం యూనిట్ విడుదల చేసింది.
విడుదలైన కొద్దిసేపట్లో టీజర్ సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే 12మిలియన్ల వ్యూస్ అందుకుంది. టీజర్ విడుదలైన పద్దెనిమిది నిమిషాల్లో 100కె లైక్స్ ను రాబట్టుకుంది.