ఒకప్పుడు లేడీ అమితాబ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హాట్ బ్యూటీ నాటి అగ్రహీరోయిన్ విజయశాంతి. దాదాపు దశాబ్ధం తర్వాత ఆమె మరల మేకప్ వేసుకున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి నేతృత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ,హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోహీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు.
ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు విజయశాంతి. ఇందులో ఆమె పాత్ర పేరు భారతి. ఈ మూవీ షూటింగ్ ప్రారంభంలోనే విడుదలైన ఫస్ట్ లుక్ భారీ అంచనాలను పెంచింది. ఆ తర్వాత నిన్న శుక్రవారం విడుదలైన టీజర్లో విజయ శాంతి రోల్ చాలా కీలకంగా.. అత్యంత అద్భుతంగా ఉంటుంది అని ఆర్ధమైంది. ఈ టీజర్లోని విజయశాంతి ఆహార్యం.. డైలాగ్ డిలవరింగ్.. లుక్ .. క్యాస్టూమ్స్ అన్ని ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి.
టీజర్లో వచ్చే గాయం విలువ తెల్సినవాడే సాయం చేస్తాడు బాబాయ్ అనే డైలాగ్ రీఎంట్రీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు సాంకేతం ఇచ్చింది. చాలా మోస్ట్ పవర్ ఫుల్ లుక్ లో ఉన్న విజయశాంతి మొత్తం టీజర్లో 3 షాట్స్‌లో కన్పించారు. ఇందులో తొలి షాట్లో మోస్ట్ పవర్ పుల్ పాత్రలో కన్పించారు. రెండో దాంట్లో వర్షంలో తడుస్తూ కనిపించారు. మూడో షాట్‌లో డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. . టీజర్లో ఆమెను చూస్తుంటే ఈ పాత్ర కేవలం ఆమె మాత్రమే చేయగలదనేలా విజయశాంతి మెప్పించారు.