దిల్ రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఎందుకంటే తన కష్టంతో ఒక్కొమెట్టు ఎదిగి చివరికి ఇప్పుడు టాప్ నిర్మాతల్లో ఒక్కరిగా నిలిచాడు. డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఐనాసరే నిజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆడాలంటే దిల్ రాజ్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే దిల్ రాజు ఎంత తెలివైనవాడో చెప్పాలంటే ఈ ఉదాహరణ చూడాల్సిందే. మహేష్ తాజాగా విడుదలైన మహర్షి చిత్రం దిల్ రాజు ఒక్కరే నిర్మించాలి. దానికి అగ్రిమెంట్ కూడా ఉంది.
అయితే సినిమా రిలీజ్ అయ్యే సమయానికి పీవిపీ బ్రహ్మోత్సవం గురించి చెప్పగా మహేష్ కాదనలేక ఒప్పుకున్నారు. అలాగే తనకున్న రిలేషన్ కారణంగా అశ్విని దత్ ను కాదనలేకపోయాడు. ఇలా ముగ్గురు నిర్మాతలు రావడంతో సినిమా పరంగా వారికి లాభం తగ్గింది. దాంతో దిల్ రాజు అసంతృప్తి చెందారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ సుంకర తో పాటు దిల్ రాజు ను కూడా ఉండమని మహేష్ కోరడం జరిగింది. అయితే ఇక్కడ దిల్ రాజు తెలివిగా ఒక సైలెంట్ పార్టనర్ గానే వ్యవరిస్తున్నారు. ఎందుకంటే నిర్మాతగా ఉంటే అటు అనిల్ రావిపూడి, మహేష్ తో మరో ఛాన్స్ ఉండదు, ఇప్పుడు అనిల్ రావిపూడి తో ఎఫ్3 కచ్చితంగా చెయ్యాల్సిందే. అంతేకాకుండా ఇటు మహేష్ కూడా ఒక సినిమా చెయ్యలి.