Home / ANDHRAPRADESH / మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..

మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలోనే షాక్ ఇవ్వనున్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతనూ కూడా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం..

ఇప్పటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిలో పలువురు వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతను తొలగించి పారామిలటరీ బలగాలతో భద్రత కల్పించనున్నారు.

దీంతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్,ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్,మాజీ ముఖ్యమంత్రులు మాయవతి,ములాయం సింగ్ యాదవ్,నారా చంద్రబాబు నాయుడు,ప్రకాష్ సింగ్,ఫరూక్ అబ్దుల్లా ,బీజేపీ సీనియర్ నేత ,మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీతో సహా పలువురు వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రతను తొలగించనున్నది బీజేపీ సర్కారు..