Home / 18+ / ఏందయ్యా ఎన్టీఆర్ రోజురోజికి బొత్తిగా భయంలేకుండా పోతుంది..!

ఏందయ్యా ఎన్టీఆర్ రోజురోజికి బొత్తిగా భయంలేకుండా పోతుంది..!

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎస్ఎస్ రాజమౌళిదే. ఎన్నో సినిమాలను చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరించారు. అయితే తాజాగా ఇద్దరు పెద్ద హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదే ఆర్ఆర్ఆర్..ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోమారమ్ భీమ్ పాత్రలో కనిపిస్తారని అందరికీ తెలుసు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే ఈ చిత్రం నుండి ఒక వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకైన వీడియో క్లిప్ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నిజమైన పులితో పోరాడుతాడని కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ నిజమైన పులితో పోరాడారు, ఇది చాలా మందికి షాక్ ఇస్తుంది. ఇలా ఎన్టీఆర్ చిత్రం మొత్తం ఎంతో కష్టపడి ఎన్నో ధైర్య సాహసాలు చేసారు.