ఆరోజుల్లో రాజకీయ నేతలు అంటే పేరు వింటే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజుల్లో పలానా మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అది 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి కూడా సాధ్యం కాలేదు. ఒక్క జగన్ కే అది సాధ్యం అయ్యింది. ఈరోజుల్లో ఏదైనా మీటింగ్ అంటే ముక్కా, చుక్కా లేనిదే కష్టమే..కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇవన్నీ రావని చెప్పాలి. దీనికి ముఖ్య ఉదాహరణ ప్రజాసంకల్ప యాత్ర అని చెప్పాలి. అందరు ఆ పెద్దాయన కొడుకు మనకి ఏదో చెయ్యడానికి వస్తున్నాడు, తమ గోడును వినిపించాలి అనే వచ్చారు. ఇక తాజాగా చంద్రబాబు ప్రసంగాలు చూస్తే వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డికి జాలేస్తుందట. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టారు. “గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడు”అని అన్నారు.
