తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన దిశ సంఘటన మాదిరిగా మరో ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకి చేరుకుని మహిళ శరీరంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.