Home / SLIDER / అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి

అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి.

వ్యాపారులు,కిరణా షాపుదారులు వస్తువుల ధరలను అమాంతం పెంచారు.దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది.లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిత్యవసర వస్తువుల విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడ ఏ ప్రాంతంలో అయిన నిత్యవసర వస్తువుల ధరలను పెంచి విక్రయిస్తే టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేసి పిర్యాదు ఇవ్వోచ్చని అధికారులు తెలిపారు.

1967ను టోల్ ఫ్రీ నెంబరుగా కేటాయించగా..7330774444నెంబర్ను వాట్సాప్ గా ప్రకటించింది.ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ప్రతి రోజు ఉదయం 10గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేయనున్నాయి.