Home / INTERNATIONAL / బ్రిటన్ రాజుకుంటుంబానికి తాకిన కరోనా

బ్రిటన్ రాజుకుంటుంబానికి తాకిన కరోనా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు కరోనాకు అందరూ సమానమే అన్నట్లు ప్రపంచంలోని అందరికీ కరోనా వైరస్ సోకుతుంది.ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవారు 4లక్షలకుపైగా మంది దాటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

తాజాగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్(71)కి కరోనా వైరస్ సోకింది.చార్లెస్ కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.

పరీక్ష ఫలితాల్లో పాజిటీవ్ రావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.మరోవైపు చార్లెస్ సతీమణికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.ఫలితం ఇంకా తేలియాల్సి ఉంది.