Home / INTERNATIONAL / పేపర్ల వలన కరోనా సోకుతుందా..?

పేపర్ల వలన కరోనా సోకుతుందా..?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ వలన గజగజలాడుతుంది.ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ పరిస్థితులు విధించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.

ఇది ఇలా ఉంటే మరోవైపు పేపర్లను అంటుకోవడం వలన..పేపర్లను తాకడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వదంతులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది.పేపర్లను అంటుకోవడం..తాకడం వలన..పేపర్లను చదవడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తేల్చి చెప్పింది.

మరోవైపు నిర్భయంగా ఎలాంటి ఆందోళనలు చెందకుండా న్యూస్ పేపర్లను వేయించుకోవచ్చు.ఎక్కడ ఏమి జరుగుతుందో తెల్సుకోవచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.