Home / BUSINESS / ఆకాశాన్నంటిన మద్యం ధరలు

ఆకాశాన్నంటిన మద్యం ధరలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే.

అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు.

ఈ క్రమంలో బీర్ బాటిల్ ఏకంగా మూడు వందలు,మద్యం ఫుల్ బాటిల్ ఏకంగా రెండు వేలు పలుకుతుంది.ఉమ్మడి మెదక్,మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాలో బ్లాక్ లో మద్యం ఏరులై పారుతుంది.సీల్ వేయకముందే మద్యం వైన్ షాపుల యజమానులు కొందరూ కోట్ల విలువ చేసే మద్యాన్ని బయటకు తెచ్చి ఇప్పుడు బ్లాక్ లో అమ్ముతున్నారు.దీంతో బీరు,వైన్స్ ధరలు ఆకాశాన్నంటున్నాయి.