Home / SLIDER / తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలో కొత్తగా 92 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా కారణంగా మరో ఐదుగురు మృతిచెందారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3742 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

142 మంది మృతిచెందారు. గత కొద్దిరోజులతో పోలిస్తే ఈ రోజు తక్కువ కేసులు నమోదవ్వడం కాస్త ఉరటనిచ్చే అంశం కావడం విశేషం..