తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి కేంద్ర హోం సహయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన నియంత్రణ చర్యలు,కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్న పలు సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు.రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి..
ప్రజలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి..కేంద్ర ఆరోగ్య సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆ లేఖలో కేంద్ర మంత్రి సూచించారు..