కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో విలయతాండవం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరో 380మంది చనిపోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది.
వీరిలో ఇప్పటివరకు మొత్తం 16,475మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,21,722మంది కోలుకోగా మరో 2,10,120మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.