Home / SLIDER / కరణ్ నాయర్ కు కరోనా

కరణ్ నాయర్ కు కరోనా

భారత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ కరోనా వైరస్‌ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

రెండు వారాల క్రితం కరుణ్‌ నాయర్‌.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్‌ నాయర్‌ సెల్ఫ్‌ హెమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉన్న నాయర్‌కు నాలుగు రోజుల క్రితం జరిపిన కోవిడ్‌-19 పరీక్షల్లో కోలుకున్నట్లు సమాచారం. గత నెల్లో చేతన్‌ చౌహాన్‌ కరోనా బారిన పడగా, ఆపై కరోనా వైరస్‌ సోకిన క్రికెటర్‌ కరుణ్‌ నాయర్‌ కావడం గమనార్హం