తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదు అవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
తాజాగా 2011 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,024 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 32,994 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా మృతుల సంఖ్య 866కి చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 75శాతం కాగా, మరణాల రేటు 0.63 శాతంగా నమోదు అయ్యింది. ఇదిలాఉండగా, గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇక మేడ్చల్ 190 కేసులు, రంగారెడ్డి 171, నల్లగొండ 135, కరీంనగర్ 129, ఖమ్మం 128, భద్రాద్రి 86, జగిత్యాలలో 79 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి