ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు పరీక్షించగా.. 6,923 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 64,876. వైరస్ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5,708కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.