తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి.
వైరస్ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్-19 వైరస్ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు.
తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం 29,673 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా హోం ఐసోలేషన్‌లో 24,054 మంది ఉన్నారు.