Home / NATIONAL / దేశంలో కొత్తగా 67వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 67వేల కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 63 వేల కేసులు రికార్డ‌వ‌గా, నేడు దానికి కొంచెం ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 73 ల‌క్ష‌లు దాటాయి.

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 67,708 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 73,07,098కి చేరింది. ఇందులో 63,83,442 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరారు. మ‌రో 8,12,390 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 680 మంది చ‌నిపోయారు. దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 1,11,266కు చేరాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

దేశంలో నిన్న‌టివ‌ర‌కు 9,12,26,305 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 11,36,183 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది.