Home / INTERNATIONAL / అమెరికాలో కరోన విలయతాండవం

అమెరికాలో కరోన విలయతాండవం

అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైనట్లు ఉంది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,976మంది కరోనా భారీన పడి మృతి చెందారు.

అయితే కరోనా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. అంతకుముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మంది కరోనాతో చనిపోయారు.

ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు.మరోవైపు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది కరోనాతో మరణించారు.