తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి ఆల్బమ్ ఉంటుంది. ఆగస్టులో కలుద్దాం అని చెప్పాడు. దీంతో ఈ మూవీ తొలిపాట ఆగస్టులో విడుదలయ్యే ఛాన్సుంది..