2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు.
తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు