ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నట్లు కన్పిస్తుంది. ఎక్కడ చూసిన కానీ కరోనా పాజీటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వార్తలను వింటున్నాం. తాజాగా ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బుర్లాలోని వీర్ సురేంద్రసాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వీఎస్‌ఎస్‌యూటీ)కి చెందిన 25 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు.
బాధిత విద్యార్థులంతా ఒకే హాస్టల్‌కు చెందిన వారని, వారిని చికిత్స కోసం బుర్లా వీర్ సురేంద్ర సాయి ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లోని కొవిడ్-19 హాస్పిటల్‌లో చేర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎలాంటి లక్షణాలు లేని మరో 15 మందిని హాస్టల్‌లోని ప్రత్యేక భవనంలో ఉంచినట్లు తెలిపారు.