టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మధ్య లేదని దుఃఖ సాగరంలో మునిగింది. బామ్మ చనిపోయిందనే విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము.
ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది.
ధైర్యంగా ఉండడం, కావలసిన వారి కోసం ఈగోలను పక్కన పెట్టడం అన్ని నేర్పించింది. నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. లవ్ యూ ఆజీ. షూటింగ్ సమయంలో కాల్స్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని నువ్వడిగే ప్రశ్పలు, ఫోన్ కాల్స్ తప్పక మిస్ అవుతాను. నీ ఆత్మక శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను అని పూజా పేర్కొంది.