కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు