నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ నటిస్తున్న 65వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి.
దీంతో విజయ్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని భావించారట. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ దీంతో రష్మిక ప్లేస్ లో విజయ్ కు జోడీగా పూజా హెగ్డను తీసుకున్నట్లు తెలుస్తోంది