ప్రస్తుతం మన దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
రెండోదశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1.68 లక్షల కేసులు నమోదవగా.. తాజాగా 1.61లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
879 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,36,89,453కు చేరగా.. మొత్తం మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. 24గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,22,53,697 మంది డిశ్చార్జి అయ్యారు.