తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 4,801 పాజిటివ్ కేసులు.. 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దీంతో కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 2,803 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు..
రాష్ట్రవ్యాప్తంగా 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 75,289 నమూనాలను పరీక్షించారు.