స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్ చేసి ఎవరో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీంతో నయనతార, విఘ్నేశ్ శివన్‌లు వ్యాక్సిన్ తీసుకోకుండా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని, తప్పుదోవ పట్టించా రంటూ నెటిజన్లు విమర్శించారు.
దాంతో మరోసారి ఒరిజినల్ ఫొటోలను పోస్ట్ చేసి ‘ఈ ఫొటోలో నర్సు చేతిలో వ్యాక్సీన్ స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి. వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపడి విమర్శలు చేయకండి’ అంటూ నెటిజన్లకు నయనతార హితవు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని సురక్షితంగా ఉండాలని నయనతార కోరారు.