Home / SLIDER / లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు

లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్‌కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు.

రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ కార్డుల జారీ ఓ చరిత్ర అనీ, ఒకే రోజు 3.09లక్షల కార్డుల జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఇందులో 8.65 లక్షల మందికి కొత్త కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. రేషన్‌కార్డులకు డిమాండ్‌ భారీగా పెరిగిందని, ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లపై దృష్టి పెట్టాలని సూచించారు.

మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ పేదవాడికి కడుపునింపడమే లక్ష్యంగా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్‌కార్డు అందజేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మందికి పెన్షన్లు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40లక్షలకు పెంచిందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అధ్యక్షతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది.