Home / NATIONAL / దేశంలో తగ్గని కరోనా ఉధృతి

దేశంలో తగ్గని కరోనా ఉధృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగున్నది. మరోసారి రోజువారీ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా.. మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు.మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.21శాతంగా ఉందని పేర్కొంది. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 52.36 డోసులు పంపిణీ చేశామని, నిన్నటి వరకు మొత్తం 48.73 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.