Home / NATIONAL / దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

మరో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,682 కేసులు నమోదవగా, 142 మంది మృతిచెందారు.దేశంలో ఇప్పటివరకు 66.89 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 4.37 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచామని తెలిపింది.