దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు.
మరో 4,42,009 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 37,681 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 260 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 26,200 పాజిటివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో మరో 114 మహమ్మారికి బలయ్యారని తెలిపింది. దేశవ్యాప్తంగా 72,37,84,586 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.