వకీల్ సాబ్ చిత్రతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలు చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఈ మూవీని దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్దే నటిస్తుందా లేదా అనేది కూడా అదే రోజున తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 2022 చివరలో విడుదల చేసే అవకాశం ఉంది.