Home / SLIDER / హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని  హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది.

నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలు వెలువడికానున్నాయి.