తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా,ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.
రీసెంట్‌గా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రకి సంబంధించిన సాంగ్ విడుదల చేయగా, ఇది మంచి ఆదరణ దక్కించుకుంది. మరోవైపు ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలోనటిస్తుంది. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
రష్మిక తన పాపులారిటీని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ ఉంది. అయితే దక్షిణాది సినీ తారల సోషల్ మీడియా పాపులారిటీ ఆధారంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా రూపొందించింది. ఇందులో రష్మిక మందన్న 9.88 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, విజయ్ దేవరకొండ (9.67) రెండోస్థానంలో ఉన్నాడు. కన్నడ స్టార్ యశ్ (9.54) మూడో స్థానంలో, సమంత (9.49) నాలుగో స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ (9.46) కు ఐదో స్థానం, ప్రభాస్ (9.40) కు ఎనిమిదో స్థానం లభించాయి.