సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరి ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజ రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఖిలాడి’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ క్రమంలోనే మహేశ్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ అందుకుందట. పూజ హెగ్డే ఇందులో మెయిన్ హీరోయిన్. మహేశ్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ప్రశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్.
ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కానుండగా, బ్యాంకింగ్ రంగంలో జరుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో కథ సాగనుంది. ఈ మూవీ పూర్తి చేసి త్రివిక్రమ్ మూవీని మహేశ్ పట్టాలెక్కించనున్నారు.