వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ఏదోవిధంగా గట్టెక్కాలని చూస్తున్నాడు. అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం ఆయనకేకాదు.. ఆయన పార్టీ బీజేపీ నేతలకు అలవాటైపోయింది. అందరికంటే రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వెలగబెట్టిన ఈ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన్నాటినుంచీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం.. ఉప ఎన్నికలో ఏదోవిధంగా గెలవడం కోసం నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ఈయనగారి అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకొంటున్నా.. జంకూ గొంకూ లేక బొంకుతూనే ఉన్నాడు. ఈటల అబద్ధాలను చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడుతున్నాడని హుజూరాబాద్ ప్రజలే అనుకొంటున్నారు. ఈటల అబద్ధాల్లో మచ్చుకు కొన్ని..
అబద్ధం 1.
తమను ఆదుకోవాలని పేదలు అడిగితేనే అసైన్డ్ భూములు కొన్నాను.
ప్రజల మాట: దళితులంటే ఆయనకు చులకన భావం. ఏనాడూ వారికి ఏ విధమైన సాయం చేయలేదు.
అబద్ధం 2.
బీజేపీలో చేరక ముందు మాట..
- రైతుల నడ్డి విరిచేది, కార్పొరేట్ కంపెనీలకు మోకరిల్లేది, కుల మతాల మధ్య చిచ్చు పెట్టేది బీజేపీయే. ప్రభుత్వరంగ సంస్థలను తాకట్టు పెట్టేది, చిరు వ్యాపారుల పొట్ట కొట్టేది బీజేపీయే.
బీజేపీలో చేరిన తరువాత
- దేశాన్ని బీజేపీయే బాగు చేస్తుంది. కమలం ద్వారానే అభివృద్ధి సాధ్యం. పెట్రోలు, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడానికి బీజేపీ కారణం కాదు.
- వాస్తవం: గ్యాస్ సిలిండర్, పెట్రో ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం.
ప్రజల మాట: తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే
బీజేపీలోఈటల చేరాడు.
అబద్ధం 3.
- గెల్లు శ్రీనివాస్ యాదవ్ బానిస బిడ్డ
బుకాయింపు: గెల్లును అవమానించడంపై యాదవ సామాజిక వర్గం మండిపడి ఆందోళన చేయడంతో మాట మార్చాడు. తాను గెల్లును బానిస బిడ్డ అననేలేదని బుకాయించాడు.
అబద్ధం 4.
- కుర్చీలో దర్జాగా కూర్చొని దళితులతో తన కాళ్ళకు పాలతో అభిషేకం చేయించుకున్నాడు.
బుకాయింపు: దీనిపై దళిత లోకం ఆగ్రహించడంతో మాట మార్చాడు. మొదట దళితుల కాళ్లకు పాలతో అభిషేకం చేశాకనే, తాను చేయించుకొన్నానని బుకాయింపు.
ప్రజల మాట: దళితులంటే ఆయనకు చిన్నచూపు. అధికారంలో ఉండగా దళితులను దూరంగా ఉంచాడు.
అబద్ధం 5
బీజేపీలో చేరక ముందు
- దేశంలో పేదరికంతో బతుకుతున్నది దళితజాతి అని కేసీఆర్ నోట వందలసార్లు విన్న. కేసీఆర్ దళిత చైతన్య యాత్ర చేపడుతానన్నారు.
ఆ తరువాత:
- దళితుల ఓట్ల కోసమే దళిత బంధు పథకం పెట్టారు. హుజూరాబాద్‌లో అందుకే అమలు చేస్తున్నారు.
వాస్తవం: దళితుల అభ్యున్నతికి కేసీఆర్ 1996లోనే సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్‌లో చర్చించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆనాడే కేసీఆర్ నిర్ణయించారు.
అబద్ధం 6.
- దళిత బంధు పథకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాకు సంబంధం లేదు.
వాస్తవం: ఎన్నికల సంఘానికి దాఖలైన ఫిర్యాదులు వెంటనే ఈటలకు చెందిన సోషల్ మీడియాలో వైరల్. ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుల మేరకు దళితబంధును ఆపివేయాలని ఈసీ ఆదేశం.
ప్రజల మాట: దళితులు బాగుపడటం ఈటలకు నచ్చదు. అందుకే దళిత బంధును అడ్డుకొన్నాడు.
అబద్ధం 7.
- ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు దగ్గర కారు ప్రమాదం లో ఆటో డ్రైవర్ మరణిస్తే, టీఆర్‌ఎస్ నే త కారు ఢీకొనడంతోనేనని హంగామా.
వాస్తవం: కారు యజమాని విశ్వనాథ్ వినోద్.. బీజేపీ నేత బండి సంజయ్‌కు సన్నిహితుడు.
అబద్ధం 8.
శంకర నందన గార్డెన్స్‌లో నా సభకు కరెంట్ కట్ చేయించి, మంత్రి హరీశ్‌అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
వాస్తవం: ఆరు నెలలుగా బిల్లు కట్టకపోవడంతో మూడు నెలల కిందటే కరెంటు కనెక్షన్ కట్ అయింది. జనరేటర్‌లో డీజిల్ లేక కరెంట్ కైట్టెంది.
ప్రజల మాట: జనరేటర్‌లో డీజిల్ ఉందా లేదా చూసుకోనోడు రేపు హుజూరాబాద్ ప్రజల బాగోగులు ఏం చూస్తడు.
అబద్ధం 9.
- గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.291పన్ను వసూలు చేస్తున్నది.
- అక్టోబర్ 23న..గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్రం 22 రూపాయలే పన్ను వసూలు చేస్తున్నది.
వాస్తవం: గ్యాస్ సిలిండర్‌పై జీఎస్టీ పేరిట కేంద్రం వసూలు చేసే 5 శాతం పన్ను అంటే దాదాపు రూ. 44లో సగం అంటే రూ.22 రాష్ర్టానికి ఇస్తుంది.
అబద్ధం 10.
- నేను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని. ముదిరాజ్ బిడ్డను.
వాస్తవం: పట్టాదారు పాస్ పుస్తకంలో ఈటల కొడుకు పేరు నితిన్‌రెడ్డి, తండ్రి పేరు రాజేందర్‌రెడ్డి అని ఉన్నది. 2019 నుంచి అలాగే ఉన్నా మార్చుకోలేదు. కొడుకు, బిడ్డకు రెడ్డి కులస్తులతో పెండ్లిళ్లు జరిపించిన ఆయనలో బీసీ హృదయం ఉన్నదా?
ప్రజల మాట: తన కులస్తులైన ముదిరాజ్‌లను ఇబ్బందులు పెట్టేవాడు.
అబద్ధం 11
- నా డీఎన్‌ఏ అంతా లెఫ్ట్. నేను వామపక్ష, లౌకిక వాదిని.
వాస్తవం: ఆగస్టు 19న మాట్లాడుతూ- లెఫ్టు, రైటు అనేవి ఉండవని, డైనమిక్‌గా ఉండాలని ఈటల నిస్సిగ్గుగా చెప్పుకొన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నందు వల్ల అందులో చేరుతున్నానన్నాడు.
ప్రజల మాట: అధికారంలోకి బీజేపీ వస్తుందనే నమ్మకంతో అందులో చేరిన ఈటల, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరతాడన్నమాట.
అబద్ధం 12
- నాపై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి. అందువల్ల హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో చర్చించి రాజీనామా చేశాను.
- ఎన్నికల ప్రచారంలో: నన్ను బలవంతంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. అసైన్డ్ భూముల కబ్జా అబద్ధం.
వాస్తవం: అసైన్డ్ భూములు కొన్నానని గతంలో ఆయనే అంగీకరించాడు. ఆ వ్యవహారం అంతా బయటపడటంతో ముఖం చెల్లక రాజీనామా చేశాడు.
అబద్ధం 13
- ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చే మనిషిని కాను.
వాస్తవం: ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాలు, బొట్టు బిళ్లలు, దసరా రోజు క్వార్టర్ బాటిళ్లను ప్రజలు నేలకు కొట్టడంతో అసలు బండారం బ యటపడ్డది. కొందరికి కుట్టుమిషన్లు ఇచ్చాడని చెప్పుకొంటున్నరు.
ప్రజల మాట: చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేని మనిషి ఈటల.
అబద్ధం 14.
- రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బతుకమ్మ పాట పాడినట్టు ప్రచారం.
వాస్తవం: బతుకమ్మ పాట వీడియోకు ఆడియోను మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు తేలింది.
అబద్ధం 15: టీఆర్‌ఎస్‌ను మంత్రి హరీశ్‌రావు తిట్టినట్టు ఫేక్ వీడియోను ఈటల ప్రచారం చేయించాడు.
వాస్తవం: అసలు వీడియో రావటంతో ఈటల బండారం బయటపడ్డది.
అబద్ధం 16: హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో మంత్రి కేటీఆర్ కామెంట్ చేసినట్టు ఫేక్ వీడియో సృష్టించాడు.
వాస్తవం: ఫేక్ వీడియో బండారం వెల్లడితో ఈటల పరువుపోయింది.
అబద్ధం 17: తాను డిగ్రీ చేసినా నిరుద్యోగినంటూ, బర్లు కాసుకుంటే బెటరంటూ ఉద్యోగాలపై వ్యాఖ్యలు చేసిన ఓ యువతి వీడియోను తమ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
వాస్తవం: అసలు ఆ యువతి డిగ్రీ చదువుకోలేదని, సరదాగా టిక్‌టాక్ కోసం వీడియో చేసినట్టు తెలిసింది.