ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
