తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాలకెళ్లే ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం 7 నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు ఏపీకి ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో 3,334 బస్సులు, ఏపీకి 984 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్పెషల్ బస్సుల్లో ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయమని చెప్పారు.