Site icon Dharuvu

విడిపోయిన ధనుష్ దంపతులు

సూపర్ స్టార్,ప్రముఖ నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య,తమిళ స్టార్ హీరో ధనుష్ దంపతులు తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు.

తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా కలసి ఉన్న తాము ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో వెళ్తున్నట్లు ఐశ్వర్య పేర్కొన్నారు.

తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. వారు విడిపోవడానికి గల కారణాలు తెలియలేదు.

Exit mobile version